- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బాబురావు పటేల్ సేవలు అమూల్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ అన్నారు. ఈ క్రమంలో ఉత్తమ సేవల అవార్డు అందుకున్న సహకార సంఘం కార్యదర్శి బాబురావుకు ఆయన మంగళవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మండల సర్పంచులు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



