నవతెలంగాణ-హైదరాబాద్: సిరియాలో భారీ బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించడం కలకలం సృష్టించాయి. దీంతో ఒక్కసారిగా భద్రతా దళాలు ఆందోళన చెందాయి. వెంటనే భద్రతా బలగాలు రహదారులను మూసివేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. అయితే అధ్యక్షుడు మాక్రాన్ కాన్వాయ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా పేలుళ్లను ప్రత్యక్షంగా గుర్తించలేదని సమాచారం. అనంతరం సిరియా రాష్ట్ర టెలివిజన్.. మాక్రాన్-అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా సిరియా అధ్యక్ష భవనంలో సమావేశమైనట్లు ధృవీకరించాయి.
సిరియాలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -



