Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి మాట్లాడారు. రాజకీయంగా,ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యన్నతి కొరకు ఎమ్మార్పీఎస్ ఎనలేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఉద్యమాల ఫలితంగానే వర్గీకరణ బిల్లుకు మోక్షం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ జన్మదినం సైతం నేడే కావడం కార్యకర్తలకు సంతోషాలు పంచిందన్నారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్,సర్పంచ్ బండి స్వామి,వార్డు సభ్యులు కామ బాపు,రాకెష్,సారయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు కేసారపు చంద్రయ్య మాదిగ,నారమళ్ళ నవీన్ మాదిగ,సందీప్ మాదిగ,జంగం పోచయ్య మాదిగ,ఇందారపు శ్యామ్ మాదిగ,ఎర్ర పోచం మాదిగ,బొంతల రమేష్ యాదవ్,మాచర్ల సురేష్ గౌడ్,బూడిద సది మాదిగ,సురేష్ మాదిగ,కేసారపు రాజయ్య మాదిగ,సిద్దు మాదిగ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -