– జాతీయ రహదారిపై
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలతో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు స్పందించారు. మంగళవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గుంతల మరమ్మత్తు కార్యక్రమాన్ని చేపట్టారు. బీటీ రోడ్డుపై పలుచోట్ల పడ్డ గుంతలను సిమెంట్ కంకరతో పూడిపించారు. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం సమీపంలో ఏర్పడ్డ పెద్ద గుంతలను జెసిబి సహాయంతో తవ్వించి ఇసుక కంకర తో కలిపిన కాంక్రీట్ మిశ్రమాన్ని వేసి చదును చేయించారు. రోడ్డు మరమ్మతు పనులను ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై పడ్డ గుంతల మూలంగా ఎవరు ప్రమాదాల బారిన పడకూడదనే ఉద్దేశంతో మరమ్మత్తులు చేయించినట్లు తెలిపారు. అయితే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి జాతీయ రహదారిపై పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.బీటి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడిపించి రోడ్డు మరమ్మత్తులు చేయించిన పాలకవర్గ సభ్యులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
స్పందించిన గ్రామ పంచాయతి పాలకవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


