Thursday, March 5, 2026
E-PAPER
Homeక్రైమ్పోరాడి ఓడిన బాలిక

పోరాడి ఓడిన బాలిక

- Advertisement -

– ప్రేమ పేరుతో వంచన చేయడంతో మూడు నెలల కిందట ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ – ధర్మపురి

ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్న ఓ యువకుడు పెండ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక(17) మూడు నెలల కిందట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇన్ని రోజులూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ జి.మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన కోలా మనోజ్‌(22) ధర్మపురికి చెందిన ఇంటర్‌ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెండ్లి ప్రస్తావన వచ్చేసరికి నిరాకరించడమే కాకుండా ‘చస్తే చావు’ అంటూ దుర్భాషలాడాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గత డిసెంబర్‌ 8న ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ప్రయివేటు ఆస్పత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు మూడు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలిక మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -