8వ తరగతి సోషల్ సైన్స్‌లో న్యాయ వ్యవస్థ
అధ్యాయంలో మార్పులు న్యాయ వ్యవస్థపై వివాదాస్పద
అంశాలు పూర్తిగా తొలగింపు
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థపై వివాదానికి దారితీసిన 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) పూర్తిగా సవరించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద అంశాల్ని తొలగించి కొత్త అధ్యాయాన్ని విడుదల చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, కోర్టుల్లో భారీగా కేసుల పెండింగ్, కీలక తీర్పులకు సంబంధించిన అంశాల్ని తొలగించగా- ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్), ట్రైబ్యునల్స్, ప్రత్యా మ్నాయ వివాద పరిష్కార విధానాలపై కొత్త సమాచ ారాన్ని చేర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని ‘ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ సొసైటీ’ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, కేసుల పెండింగ్, మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ఉండటంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ అధ్యాయం- న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపైనే సుప్రీం ర్టు సుమోటాగా విచారణ చేపట్టింది. అనంతరం పాఠ్య పుస్తకానికి సంబంధించిన ముద్రణ పూర్తయిన, డిజిటల్ కాపీలు అన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. అలాగే ఆ పుస్తకాన్ని మళ్లీ ముద్రించడం, డిజిటల్ రూపంలో ప్రచురించడం లేదా పంపిణీ చేయడంపై పూర్తి నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్టీ కూడా క్షమాపణలు చెప్పింది.



