Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పరిశీలన

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పరిశీలన

- Advertisement -

పాల్గొన్న ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి
నవతెలంగాణ – గోవిందరావుపేట

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం మండలంలోని చల్వాయి, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి సందర్శించి, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, బీఎల్‌వో యాప్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో సేకరించి, బీఎల్‌వో యాప్‌లో త్వరితగతిన నమోదు పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.

ప్రతి ఓటరు వివరాలను నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సృజన్ కుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నితీష్, ఆర్ ఐ సునీల్ సంబంధిత ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -