నవతెలంగాణ-మద్నూర్
నిరుపేద కుటుంబాల ఆడ బిడ్డల పెండ్లిళ్లకు ప్రజా పాలన ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి డోంగ్లి మండల తాసిల్దార్, ఆర్ ఐ, డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షులు యూనుస్ పటేల్, ఏ.ఎమ్.సి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు లక్ష్మణ్, మండల సర్పంచ్ లు బస్వంత్ పటేల్ ,సంగ్రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనుంజయ్ పటేల్,విలాస్, ప్రవీణ్ పటేల్,శివారెడ్డి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మీ చెక్కులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



