నవతెలంగాణ-ఆలేరు టౌన్
తన బ్రతుకునే ప్రజాపాటగా మార్చుకున్న మహా గాయకుడు అరుణోదయ నాగన్న సంతాప సభ ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో జూలై 11న నిర్వహించనున్నట్లు, అరుణోదయ యాదాద్రి జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్ అన్నారు. అరుణోదయ నాగన్న ఈ నెల 3న అనారోగ్యంతో మరణించాగా.. ఆయన స్మృతిలో ఈ నెల 11న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే సంతాప సభను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణంలో బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సహదేవ్ మాట్లాడుతూ ..అరుణోదయ నాగన్న అరుణోదయ సంస్థ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా, న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులుగా సేవాలాందించారన్నారు. కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ ఉదయ్, సిద్దేశ్వర్, నాయకులు బేజాడి కుమార్, సుంచు రాములు, తదితరులు పాల్గొన్నారు.



