- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపల్ 6వ వార్డ్ బహదూర్ పేట వచ్చే వాటర్ మోటార్ మరమ్మత్తుకు గురైంది. నీరు లేక కాలనీ వాసులు నానా అవస్థలు పడ్డారు. ఈ విషయమై బుధవారం స్తానికులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు దృష్టి కి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి సుమారు రూ.2 లక్షల వ్యయంతో కాలనీలో మోటార్ ని ప్రారంభించారు. అనంతరం సమస్యను విని వెంటనే పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు జెట్ట నీరజ సిద్దులు, మల్లెల సరిత శ్రీకాంత్, వారణాసి మరియమ్మ మార్క్, పస్తం ఆంజనేయులు, పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


