- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ రెడ్డి, వెంకటయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాయకులు సంపత్ కుమార్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, రామ్ గౌడ్, మహమ్మద్ సాదిక్, రమేష్, ఉస్మాన్, ఆదాము, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



