Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ను నడపండి

కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ను నడపండి

- Advertisement -

ప్రభుత్వానికి రిటైర్డ్‌
ఇంజినీర్ల సంఘం విజ్ఞప్తి


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్‌‌నినో వల్ల ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌‌ హౌజ్‌‌ ద్వారా నీటిని ఎత్తి పోయాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ర్ట అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు ఎం.శ్యాంప్రసాద్‌‌రెడ్డి, తన్నీరు వెంకటేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తినందున మోటర్లు నడిపినా ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ‘ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నీటిని లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ స్థితి అనుకూలంగా ఉంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌ రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. మూడు పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారం జలాశయంలో 5.1 టీఎంసీలు, సుందిల్లలో 3.78 టీఎంసీలు కలిపి మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంది. రెండు బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనా 8 టిఎంసీల నీరు 1.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహ వేగం నదిలో 24 గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే 2.04 లక్షల క్యూసెక్కులు 12 గంటలు, 4.08 లక్షల క్యూసెక్కులు 6 గంటలు, 8.16 లక్షల క్యూసెక్కులు 3 గంటలు మాత్రమే ఉంటాయి. గతంలో మేడిగడ్డ వద్ద నమోదైన ప్రాణహిత ఆధారిత ప్రవాహం వంద రోజుల్లో పలుమార్లు పది లక్షల క్యూసెక్కుల పై స్థాయికి చేరుతుందని వరద రికార్డులు తెలుపుతున్నాయి.

ఇలాంటి వరద సమయంలో కూడా 3 నుంచి 6 గంటల్లో 8.8 టీఎంసీల నీటిని మూడు లిఫ్ట్‌‌లు గొలుసులోకి వచ్చినా ఆస్తి, ప్రాణ నష్టం, ఊర్ల ముంపు వంటి అపాయాలు గత అనుభవాల ప్రకారం కనిపించలేదు’’ అని వివరించారు. ప్రాణహితలో వరద నీటి మట్టం మేడిగడ్డ మినిమమ్‌ ‌డ్రా డౌన్‌ ‌లెవల్‌ కంటె ఎత్తుగా కొనసాగుతున్నంతకాలం కన్నెపల్లి పంప్ స్టేషన్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడం అనుకూలమన్నారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలను మ్యాడులర్‌ ‌లిమిట్‌ వద్ద కొనసాగిస్తూ, నీటిని ఎల్లంపల్లి వరకు తరలించడం హైడ్రాలిక్ పరంగా నమ్మకమైన విధానమని పేర్కొన్నారు. గత వరద అనుభవాల ప్రకారం, సాంకేతిక నియమాలకు లోబడి, సురక్షిత పద్ధతుల్లో లిప్టులను నడిపితే ప్రమాదాలుండవని తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తక్ష‍ణమే రాష్ర్ట ప్రభుత్వం సానుకూల ‌నిర్ణయం తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -