Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోడు భూముల పట్టాల కోసం పోరు

పోడు భూముల పట్టాల కోసం పోరు

- Advertisement -

13న చలో ఐటీడీఏను జయప్రదం చేయండి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చర్ల

పోడు భూముల సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని జులై 13న నిర్వహించే చలో ఐటీడీఏను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని స్థానిక బీఎస్ రామయ్య భవన్‌‌లో జరిగిన పోడు సాగుదారుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోడు సాగుదారులకు పెండింగ్‌‌లో ఉన్న పట్టాలు ఇవ్వాలని, వివిధ సాంకేతిక కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులను రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి మచ్చ రామారావు, మండల కమిటీ సభ్యులు పొడుపుగంటి సమ్మక్క, బందెల చంటి, దొడ్డి హరినాగవర్మ, భీమగోని నవీన్, వరదాల వలక్ష్మి, షారోని, శ్యామల చంద్రం, పోడు సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -