26 మంది విద్యార్థులకు అస్వస్థత
అచ్చంపేట ఆస్పత్రికి తరలింపు
పరామర్శించిన ఆర్డీఓ, డీఎస్పీ
నవతెలంగాణ – అచ్చంపేట
ఫుడ్ పాయిజన్‌తో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్నది. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని ట్రైబల్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురాయ్యరు. 26 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది. విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ ప్రథమ చికిత్స అందించారు. అందరి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ తెలిపారు. కొందరు కాస్త నొప్పితో బాధపడుతున్నందున వారిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, డీఎస్పీ శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జరిగిన విషయాన్ని తెలుసుకుని ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే మిషన్‌భగీరథ నీరు రాక వంటకు బోరునీరు వాడుతున్నామని, అందువల్లే పుడ్‌పాయిజన్ జరిగి ఉండొచ్చని బావిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


