Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెల్లికుదురు పిఎసిఎస్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలి 

నెల్లికుదురు పిఎసిఎస్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలి 

- Advertisement -

– కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
: మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డిసిసి సొసైటీ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎంపిటిసి పెరమాల గుట్టయ్య గౌడ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తాను ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు.

గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని పేర్కొన్నారు. పార్టీ పట్ల తనకున్న అంకితభావాన్ని, చేసిన సేవలను గుర్తించి నెల్లికుదురు డీసీసీ/సొసైటీ చైర్మన్ పదవిని తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని విజ్ఞప్తి చేశారు.పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

నేను పార్టీ అభివృద్ధి కోసం ఎప్పటికి నిరంతరం కృషి చేస్తున్నానని మరియు పార్టీ టికెట్ కేటాయించిన వారికి గెలుపు కోసం హర్నిషలు కృషి చేశానని తెలిపాడు. గ్రామస్థాయి ఎన్నికల నుండి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించి గెలుపుకు కృషి చేశానని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ అభివృద్ధికి నా ప్రాణంగా ప్రతిరోజు పనిచేస్తున్నానని అందుకోసం నాకు ఈ నెల్లికుదురు పిఎసిఎస్ డిసిసి సంబంధించిన బ్యాంక్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క మండల జిల్లా రాష్ట్ర నాయకులతో పటు ఎమ్మెల్యేను ఎంపీని కోరుతున్నానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -