Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా ఎడ్ల శ్రీకాంత్

కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా ఎడ్ల శ్రీకాంత్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకొత్తూరు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎడ్ల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి  మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంపూర్ణ మద్దతుతో ఎడ్ల శ్రీకాంత్ ను గ్రామ శాఖ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని అందించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పంపిచేయకుండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి తక్కురి దేవేందర్,  గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ మనోహర్, రమేష్, శ్రీనివాస్, యూత్ సభ్యులు క్రాంతి, మల్లేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -