Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన తహశీల్దార్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు

నూతన తహశీల్దార్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
అప్పుడెప్పుడో నిజాం పాలనలో కట్టించిన మద్నూర్ తహశీల్దార్ భవనం శిథిలావస్థకు చేరుకున్న విషయం పాఠకులకు విదితమే. ఇప్పటివరకు మరమ్మత్తులకు కూడా నోచుకోని కార్యాలయానికి ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నూతన భవన నిర్మాణానికి ముందడుగు పడింది. ఇందులో భాగంగా శుక్రవారం ఈ కార్యాలయ నిర్మాణానికి రూ. 2.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం తహశీల్దార్ ఎండీ ముజీబ్ స్థల పరిశీలన చేసి, సర్వే చేయించారు. అనంతరం ఈ భూ సర్వే నివేదకలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. మద్నూర్ తహశీల్దార్ నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -