Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఈసారి ఎస్టీ రిజర్వేషన్  కేటాయించాలి

కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఈసారి ఎస్టీ రిజర్వేషన్  కేటాయించాలి

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు : నెల్లికుదురు కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎస్టీ రిజర్వేషన్ కల్పించి ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ లు నెల్లికుదురుపై దృష్ట సాధించాలని నల్లగుట్ట తండా సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్ అన్నారు. శనివారం నల్లగుట్ట తండాలో ఆమె మాట్లాడుతూ.. నెల్లికుదురు కోపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు జనరల్, బీసీ వర్గాల వారే చైర్మన్ పదవిని చేపట్టారు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చెందారు. నెల్లికుదురు మండలంలో గిరిజన జనాభా అధికంగా ఉంది కనుక ఈసారి కచ్చితంగా ఎస్టీలకు కేటాయించాలని అన్నారు.

సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల దృష్ట్యా ఈసారి కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఎస్టి వర్గానికి కేటాయించాలని మా వినయపూర్వక విన్నపం పార్టీ పెద్దలకు చేస్తున్నామని తెలిపారు. ఈ ఒక్కసారైనా ఈ నెల్లికుదురు పిఎసిఎస్ బ్యాంకుకు ఎస్టి రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించి గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చగలరని కోరుతున్నాం అని తెలిపారు. పార్టీలో టికెట్ ఏ టికెట్ ఎవరికి వచ్చిన ఎస్టీలం అందరం ఐక్యత ఉండి పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నామని అంతే కాకుండ పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబాద్ గిరిజన ముద్దుబిడ్డలు ఆయన ఎమ్మెల్యే మరియు ఎంపీలు పార్టీ జిల్లా అధ్యక్షురాలు నెల్లికుదురు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలుపుతున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -