Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూ.320 కోట్లతో మక్తల్ నియోజకవర్గంలో హ్యామ్ రోడ్లు..

రూ.320 కోట్లతో మక్తల్ నియోజకవర్గంలో హ్యామ్ రోడ్లు..

- Advertisement -

– రేపు  మక్తల్‌కు ముగ్గురు మంత్రులు.. పైలాన్ 
– ఆవిష్కరణతో పనుల ప్రారంభం
నవతెలంగాణ – మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలో రూ.320 కోట్ల వ్యయంతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

హ్యామ్ రోడ్ల నిర్మాణంతో మక్తల్ నియోజకవర్గ రహదారుల రూపురేఖలు మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు మక్తల్‌కు విచ్చేసి పైలాన్‌ను ఆవిష్కరించి పనులను అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు.

మక్తల్–నారాయణపేట ఫోర్‌లేన్ రహదారి నిర్మాణానికి రూ.237 కోట్లు, మరికల్–మినాస్‌పూర్–లింగంపల్లి రహదారికి రూ.49.57 కోట్లు, ఆత్మకూరు–మరికల్ రహదారికి రూ.22.47 కోట్లు, మాగనూరు మండలం నల్లగట్టు–హిందూపూర్ రహదారికి రూ.10.49 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పనులన్నీ ఏడాది వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.అనంతరం ఐలిన్ స్కూల్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, కావలి శ్రీహరి, వాకిటి హన్మంతు, శ్రీనివాస్ గౌడ్, శివరాం రెడ్డి, ఆనంద్ గౌడ్, విజయ్ గౌడ్, గోవర్ధన్, కావలి తాయప్ప, శివరాజ్, గుర్లపల్లి భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -