Tuesday, March 10, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: ఫైన‌ల్‌లో టీమిండియా ఆఖండ విజ‌యం

T20 WORLD CUP: ఫైన‌ల్‌లో టీమిండియా ఆఖండ విజ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా టీమిండియా హిస్ట‌రీని డిఫిట్ చేసి చ‌రిత్రను తిర‌గ‌రాసింది. డిపెండింగ్ చాంపియ‌న్ హోదాలో వ‌రుస‌గా రెండో సారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. తుది పోరులో 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టీ20 మెగా టోర్నిలో మొత్తం మూడు సార్లు ట్రోఫిని కైవ‌సం చేసుకొని చ‌రిత్ర సృష్టించింది. ఈ విక్ట‌రీతో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మల‌తో పాటు సూర్య‌కుమార్ కూడా చ‌రిత్ర పుట్ట‌ల్లోకి ఎక్కాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌కుగాను 5 వికెట్లు కోల్పోయి 255 ప‌రుగులు చేసింది. కివీస్ బౌల‌ర్లు నీష‌మ్ 3, ర‌చిన్ ర‌వీంద్ర ఒక వికెట్ తీశారు.

ఆ త‌ర్వాత ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 159 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కివీస్ బౌల‌ర్లు సిపెర్ట్(52) అర్ధ సెంచ‌రీతో చెల‌రేగాడు. అలెన్(9), ర‌చిన్ ర‌వీంద్ర‌(1), ఫిలిప్స్(5), చాంప్‌మన్(3) దారుణంగా విఫ‌ల‌మైయ్యారు. మిచెల్ 17 నిరాశ‌ప‌రిచాడు. కెప్టెన్ శాంట‌ర్న(42) చివ‌ర వ‌ర‌కు క్రీజులో ఉండి ఒంట‌రి పోరాటం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. భార‌త్ బౌల‌ర్లు బుమ్రా 4, అక్ష‌ర్ ప‌టేల్ 3 వికెట్లు, వ‌రుణ్, పాండ్యా, అభిషేక్ త‌లా ఒక వికెట్ తీశారు.

ఫైన‌ల్‌లో విజేత జ‌ట్టు టీమిండియాకు రూ.27.48 కోట్లు గెలుచుకుంది. ర‌న్న‌ర‌ప్ టీం న్యూజిలాండ్ రూ.14.65 కోట్లు అందుకుంది. ఇక సెమీస్‌లో ఓడిన జ‌ట్ల‌ల‌కు రూ.7.23 కోట్లు. అలాగే 5-12 స్థానాల్లో నిలిచిన ఒక్కో టీంల‌కు రూ.3.48 కోట్లు. 13-20 స్థానాల్లో నిలిచిన ఒక్కో జ‌ట్టు రూ.2.28 కోట్లు అందుకోనున్నాయి. 2024లో మొత్తం ట్రోర్నీ ప్రైజ్ మ‌నీ రూ.100 కోట్లు ఉండ‌గా ఈసారి 2026లో రూ.120.37 కోట్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -