Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కబ్జా కోరల్లో బొమ్మారపు చెరువు.!

కబ్జా కోరల్లో బొమ్మారపు చెరువు.!

- Advertisement -

పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు.

మండలంలోని ఇప్పలపల్లి,కేశారం పల్లి,గంగారం, గట్టుపల్లి,కుంభంపల్లి తదితర గ్రామాల్లోని పంటపొలాలకు సాగు నీరు అందించే కన్నతల్లి లాంటి బొమ్మారపు చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.చేరువుకింద దాదాపు వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది.అయితే చెరువు శిఖంపై కబ్జాదారుల కళ్ళు పడ్డాయి.గత రెండేళ్లుగా కబ్జాకోరులు ట్రాక్టర్లతో చదును చేస్తూ ఎటిoతా శిఖం కబ్జా చేస్తున్నారు.చెరువు కబ్జాకు గురివుతుందని ఆయకట్టు రైతులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.చెరువు శిఖం ఇప్పటికే నాలుగైదు ఎకరాల వరకు కబ్జాకు గురైందని చెబుతున్నారు.అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తే చెరువు మరింతగా కబ్జా కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పట్టించుకోని కబ్జాకు గురివుతున్న చెరువు శిఖాన్నీ కాపాడి,కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -