Monday, July 13, 2026
E-PAPER
Homeఆటలుసెమీస్‌‌కు ఇంగ్లాండ్‌

సెమీస్‌‌కు ఇంగ్లాండ్‌

- Advertisement -

2-1తో నార్వేపై గెలుపు
ఫిఫా 2026 ప్రపంచకప్‌

మయామి (యుఎస్‌ఏ) : 1966 తర్వాత తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ‌ఫైనల్లోకి అడుగుపెట్టేందుకు ఇంగ్లాండ్‌ ఇంకో అడుగు దూరంలో నిలిచింది. మయామి స్టేడియంలో జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో నార్వేపై ఇంగ్లాండ్‌ 2-1తో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ ‌సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నార్వేకు అండ్రీయస్‌ ‌ఏకైక గోల్‌ అందించగా.. ఇంగ్లాండ్‌‌కు జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌రెండు గోల్స్‌‌తో విజయాన్ని కట్టబెట్టాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ అర్జెంటీనాతో ఇంగ్లాండ్‌ ‌తలపడనుంది.

​బెల్లింగ్‌‌హామ్‌ ‌జోరు
క్వార్టర్‌‌ఫైనల్లో హ్యారీకేన్‌‌పై ఇంగ్లాండ్‌.. హాలాండ్‌‌పై నార్వే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఇరు జట్లకు ఈ ఇద్దరూ గోల్‌ ‌కొట్టలేదు. సహచరులకు గోల్‌ అవకాశాలు సృష్టించలేదు. ఇంగ్లాండ్‌ ‌దూకుడుగా ఆడినా… మ్యాచ్‌‌లో నార్వే తొలుత ఆధిక్యంలో నిలిచింది. మార్టిన్‌ అందించిన పాస్‌‌ను ఆండ్రియస్‌ ‌గోల్‌‌గా మలిచాడు. దీంతో 36వ నిమిషంలో నార్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్కోరు సమం చేసేందుకు ఇంగ్లాండ్‌ ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రథమార్థం ఇంజూరీ టైమ్‌‌లో ఆంటోని గోర్డాన్‌ ‌పాస్‌‌తో జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌గోల్‌ ‌కొట్టాడు. ప్రథమార్థం 1-1తో సమవుజ్జీల సమరంగా ముగిసింది. ద్వితీయార్థంలో ఇరు జట్ల నుంచి మరో గోల్‌ ‌నమోదు కాలేదు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. 93వ నిమిషంలో జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌మరో మెరుపు గోల్‌ ‌సాధించాడు. ఇంగ్లాండ్‌‌ను 2-1తో ముందంజలో నిలిపాడు. బంతిపై నియంత్రణతో పాటు ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన ఇంగ్లాండ్‌.. నార్వే నుంచి గోల్‌‌పోస్ట్‌‌ను డిఫెండ్‌ ‌చేసుకుంది. క్వార్టర్‌‌ఫైనల్లో నార్వేను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -