Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి  మహమ్మద్ అజారుద్దీన్ ను కార్యాలయంలో మంగళవారం జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మరియు జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి  మహమ్మద్ అజారుద్దీన్ ను నాయకులు ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా స్వీకరించి, ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో సాగి, కామారెడ్డి జిల్లా మరియు జుక్కల్ నియోజకవర్గ మైనారిటీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలనే ఆకాంక్షను నాయకులు వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -