Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిరుత పులుల మృతిపై అటవీ అధికారుల విచారణ

చిరుత పులుల మృతిపై అటవీ అధికారుల విచారణ

- Advertisement -

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు, మరొకరు పరార్ 
కాలేబరాలు పడేసిన పాడుబడ్డ భావిచుట్టూ ఎర్రటి గుర్తులు పెట్టిన అధికారులు
నవతెలంగాణ – ధర్పల్లి
ధర్పల్లి, భీంగల్ మండ లాల్లోని రెండు చిరుత పులుల మృతి పై అటవీశాఖ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. చిరుత పులుల కళేబరాలు ధర్పల్లి మండల కేంద్రం లోని ఓ పాడబడిన బావిలో లభించ డంతో లోతుగా దర్యాప్తు జరుపుతు న్నారు. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో చిరుతపులి మృతిపై విచారణలో తీగ లాగితే ధర్పల్లిలో డొంక కదిలింది. జంతువులను పట్టేందుకు వలవేసిన వేటగాళ్లకు వలలో చిరుతతో పాటు అడవి పంది చిక్కిందని సమాచారం. రామడుగు అటవీ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు వలవేయడంతో చిరుత పులి, అడవిపంది వలలో చిక్కింది. చిరుతను చంపేసి దాని గోర్లు, దంతాలు, చర్మంను ఒ లుచుకొని దాని కలేబరాన్ని తమ్మలోడి బాగులో  ఓ పాటుబడిన బావిలో పడేశారు.

పులి చర్మoను సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మరొక పాట పాడుబడిన బావిలో పడేసినట్లు నిందితులు వివరించినట్లు తెలిసింది. చిరుత పులిని చంపి కళేబరాన్ని పడేసిన ధర్పల్లి కి చెందిన ముగ్గురు ఎరుకల కులానికి చెందిన సాంబ య్య, తిరుపతి, సైదులు అని తెలి సింది. చిన్నాచితక వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి మాల గుట్ట పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటు న్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు నిందితులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరొక నింది తుడు రామారెడ్డికి చెందిన వ్యక్తిగా అటవీ అధికారులు గుర్తించారు. నింది తుడి కోసం వెతకగా పరారీలో ఉన్న ట్టు తెలిసింది. నిందితులు అడవి పందినీ అమ్ముకున్నట్లు తెలిసింది. చిరుత పులిని చంపి మూడు నెలల గడిచిన అటవీ అధికారులు గుర్తించ కపోవడం నిర్లక్ష్యంను తెలియజేస్తుం ది. కమ్మర్పల్లి రేంజి పరిధిలోని ఓ చిరుతను చంపి పూడ్చివేసిన ఘటన పై విచారణ జరుపుతుండగా మరొక సంఘటన ధర్పల్లిలో చిరుత మృతి బయటపడడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ధర్పల్లి మండలంలో అడవి పందులు, జింకలు, మనుబోతులు, కుందేళ్లు, వంటి జీవరాసులకు ఉచ్చులు వేసి చంపుతున్నారు. వీటి మాంసానికి భాగా గిరాకి ఎక్కువగా ఉండటంతో  గ్రామంలో నడిబొడ్డున అమ్ముతున్న అటవీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం, అప్పటికప్పుడు స్మగ్లర్ వద్ద డబ్బులు నొక్కేయడం, లేదంటే కేసులు చేస్తామని బెదిరించ డం వంటి అవినీతి సంఘటనలతో వన్యమృగాల వేట యదేచ్చగా సాగుతుంది. నిందితులను పట్టుకొని విచారించగా పులి మృతి కేసు పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సంఘ టన ఎలా జరిగిందో నిందితులు చెప్పిన విషయాలను బట్టి అటవీ అధికారులు జాగిలాలతో విచారణ జరిపారు. చిరుత పులి ఎక్కడ వలవేసి పట్టుకున్నారో ఎలా చంపారు ఎక్కడ పడేశారు అనే విషయంపై ఇందల్ వాయి రేంజి ఆఫీసర్ రవి మహేష్ బట్ అటవీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించి పులి కళేబరాలు పడేసిన పాడుబడిన బావుల చుట్టూ రిబ్బన్ చుట్టి గుర్తులు పెట్టారు. నిందితులనుంచి పులి గోర్లు, దంతాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -