Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ఓ.. సుకుమారి` పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

‘ఓ.. సుకుమారి` పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.
ఈ నెల 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది నా నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు నా సిని మాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇకపై కూడా నా ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుం టున్నాను. మన కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం కూడా ఇంకా బాగా నటించడానికి ప్రయత్నిస్తాం. ఒక నటుడికి ఎదుటి నటుడి రియాక్షన్‌ను బట్టి కూడా నటించే అవకాశం పెరుగుతుంది. ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ , నిత్యా మీనన్ లాంటి మంచి నటీమణులతో పనిచేయడం ఎప్పుడూ ఛాలెం జింగ్‌గా ఉంటుంది. వాళ్లతో కలిసి పని చేసినప్పుడు మన నటన కూడా మరింత మెరుగవుతుంది. మా దర్శకుడు భరత్ దర్శన్ సిద్ధి పేటకు చెందినవారు. ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు తమ ప్రాంతాల కథలు, పాత్రలను చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆమె ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా? అనేదే కథ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -