Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటీ-సిరీస్ బెదిరింపులకు భయపడం

టీ-సిరీస్ బెదిరింపులకు భయపడం

- Advertisement -

తమ ‘స్పిరిట్ ఈజ్ నాట్ ఒన్చిత్ర టైటిల్‌కు సంబంధించి హిందీ నిర్మాణ సంస్థ టీ - సిరీస్ పంపిన నోటీసులపై, వారు విధించిన షరతులపై చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ,'స్పిరిట్ అనే పదంపై మాకే హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకోవాలని టీ సిరీస్ సంస్థ మాకు షరతు పెట్టింది. అలాగే హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదు. కేవలం తెలుగులోనే ప్రమోషన్స్ చేసుకోవాలని, అది కూడా ‘స్పిరిట్ ఈజ్ నాట్ ఒన్అనే పేరుతో మాత్రమే థియేటర్లలో, ఓటీటీ, యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటామంది. మా సినిమా.. మా ఇష్టం! చెప్పడానికి మీరెవరు?. మా సినిమాను మేము ఎవరికి అమ్ముకోవాలి? ఎక్కడ, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకోవాలి అనేది మా వ్యక్తిగత విషయం. దానిని శాసించడానికి, మాపై నిబంధనలు పెట్టడానికి టీ సిరీస్ సంస్థ ఎవరు?. ప్రశ్నిస్తున్నాం. మేము మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాం. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టీ సిరీస్ తీస్తున్న 'స్పిరిట్ సినిమాను హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోమనండి. దానికి మాకేం అభ్యంతరం లేదు. మా హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదు. ఈ ఏకపక్ష షరతులకు మేం అంగీకరించడం లేదు` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -