జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరో అతిథి దర్శకుడు దశరథ్ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. నిర్మాత కోమలి మహేందర్ తొట్టె మాట్లాడుతూ, ‘ఇది నా నిజ జీవిత అనుభవాల ఆధారంగా రూపొందించిన సినిమా. ఇది ఒక ఆడబిడ్డ కన్నీటి కథ. నా భర్త సహకారం, మా గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఈ సినిమా నిర్మించగలిగాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారని నమ్ముతున్నాను. నన్ను జానపద గాయనిగా ప్రోత్సహించిన మానుకోట ప్రసాద్ కి జీవితాంతం రుణపడి ఉంటాను` అని తెలిపారు.
ఓ ఆడబిడ్డ కన్నీటి కథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



