Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలువినూత్న కథతో '1=100

వినూత్న కథతో ‘1=100

- Advertisement -

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '1=100. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికే టీజర్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి దర్శకత్వం : బాబా మైలవరం, డీఓపీ: అనీల్ కుమార్ వేగూరు, సంగీతం: కెన్నీ చైతన్య, ఎడిటర్: నందమూరి హరి, కొరియోగ్రఫీ: సూర్యాస్ మాస్టర్, జోజో, ఫైట్స్: కృష్ణ ఎస్.ఎం. రాజు, డైమండ్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: నానాజీ, పోస్ట్ ప్రొడక్షన్: డిజిక్వెస్ట్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -