ఏసర్, ఇంటెల్ తో ఇన్ఫినిటీ లెర్న్ భాగస్వామ్యం
నీట్ సీబీటీ కోసం దేశంలోనే మొట్టమొదటి ‘నీట్ రెడీ ల్యాప్‌టాప్’ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన ‘నీట్’-2027వ సంవత్సరం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలోకి మారుతుంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులను డిజిటల్ పరీక్షకు సిద్ధం చేసేందుకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఏసర్ , ఇంటెల్ సంస్థలతో కలిసి ప్రముఖ విద్యా సంస్థ శ్రీచైతన్య అనుబంధ ‘ఇన్ఫినిటీ లెర్న్’ చేతులు కలిపింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా “నీట్ రెడీ ల్యాప్‌టాప్” పేరుతో స్మార్ట్ ల్యాప్‌టాప్‌ను ఈ సంస్థలు సంయుక్తంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారే తరుణంలో విద్యార్థుల్లో డిజిటల్ ప్రావీణ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.
స్మార్ట్ ల్యాప్ టాప్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అందులోని శక్తివంతమైన హార్డ్‌వేర్ ఇంటెల్ ప్రాసెసర్‌తో నడిచే ఏసర్ ఆస్పైర్ సిరీస్ ల్యాప్‌టాప్ విద్యార్థుల నిరంతర అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫినిటీ లెర్న్ యాప్ నీట్ ప్రిపరేషన్‌కు కావాల్సిన పూర్తి రిఫర్ మెటీరియల్ ఇందులో ముందే లోడ్ చేయబడి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెంటార్ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ‘ఐనా’ అనే ప్రత్యేక ఏఐ మెంటార్ సేవలు అందుబాటులో ఉంటాయి.
అసలైన నీట్ పరీక్ష వాతావరణాన్ని తలపించేలా మాక్ టెస్టులు, లైవ్, రికార్డెడ్ క్లాసులు, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టులు, విద్యార్థుల ప్రతిభను విశ్లేషించే అనలిటిక్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
విద్యా రంగంలో సరికొత్త విప్లవం : ఆయా సంస్థల ప్రతినిధుల వ్యాఖ్యలు
సుష్మ బొప్పన (సీఈఓ అండ్ డైరెక్టర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు; ఫౌండర్, ఇన్ఫినిటీ లెర్న్): “దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులు 2027 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో రాయడం పెద్ద మార్పు. విద్యార్థులకు కేవలం చదువు కాకుండా డిజిటల్ పరీక్షలకు కూడా అంతే ముఖ్యం. ఏసర్, ఇంటెల్ సంస్థలతో కలిసి మా విద్యా నిపుణులతో కలిపి ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురావడం సంతోషంగా ఉంది. దీనిపై ప్రతి విద్యార్థికి విజయానికి కావాల్సిన డిజిటల్ సపోర్ట్ లభిస్తుంది.”
హరీష్ కోహ్లీ (ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏసర్ ఇండియా):
“సాంకేతికతకు విద్యార్థుల భవిష్యత్తును మార్చే శక్తి ఉంది. పోటీ పరీక్షలు డిజిటల్ రూపంలోకి మారుతున్న తరుణంలో సరైన పరికరం అందుబాటులో ఉండటం ముఖ్యం. ఇంటెల్. ఇన్ఫినిటీ లెర్న్‌తో కలిసి మేము అందిస్తున్న ఈ ల్యాప్‌టాప్ విద్యార్థుల అభ్యాసానికి, నిరంతర పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది.”
ఉజ్జ్వల్ సింగ్ (ఫౌండింగ్ సీఈఓ, ఇన్ఫినిటీ లెర్న్):
”భారతదేశంలో నాణ్యమైన విద్యను అందించడంలో మనం ఎంతో ప్రగతి సాధించాం. ఇప్పుడు డిజిటల్ పరీక్షలకు అందరినీ సిద్ధం చేయడమే మా ముందున్న సవాలు. సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి కూడా వెనుకబడిపోకూడదనే మా లక్ష్యం. కేవలం హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్ మాత్రమే కాకుండా, విద్యార్థుల విజయ ఫలితాల ఆధారంగా ఒక డివైజ్ ను రూపొందించడం ఇదే మొదటిసారి.”
సంతోష్ విశ్వనాథ్ (వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటెల్ ఏపీజే రీజియన్):
”డిజిటల్ లెర్నింగ్ కాలంలో విద్యార్థులకు వేగవంతమైన, సమర్థమైన కంప్యూటర్ అవసరం. ఏఐ ఆధారిత అభ్యాసానికి ఇంటెల్ పీసీలు అద్భుతమైన పనితీరును అందిస్తాయి. ఈ భాగస్వామ్యం ద్వారా రాబోయే పరీక్షల భవిష్యత్తు కోసం విద్యార్థులను మేము సిద్ధం చేస్తున్నాం.”
అందుబాటు ధరలో ల్యాప్ టాప్
దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది నీట్ అభ్యర్థులు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో, ఈ ల్యాప్‌టాప్‌ను అందరికీ అందుబాటు ధరలోకి తీసుకువచ్చారు. ఈ సమగ్ర నీట్ ప్రిపరేషన్ ల్యాప్‌టాప్ సొల్యూషన్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేకంగా లభిస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం నెలకు కేవలం రూ.2,500 ప్రారంభ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయడానికి వీలు కల్పించారు.
నీట్ రెడీ ల్యాప్‌టాప్
- Advertisement -
- Advertisement -



