నివాళులర్పించిన ఏపీ మంత్రి:
కొండపల్లి శ్రీనివాస్
అంబులెన్స్‌లో స్వస్థలాలకు తరలింపు
నవతెలంగాణ – శంషాబాద్
వియత్నాంలో పడవ ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు మంగళ వారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకున్నాయి. ఆ మృతదేహాలను ఎయిర్‌పోర్టులో పరిశీలించిన ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఏపీలోని మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ మృతదేహాలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన టార్గెట్ రీచ్ కావడంతో సుమారు 30 మందిని ఏపీ నుంచి వియత్నాంకి కంపెనీ తరపున పర్యటనకు తీసుకెళ్లారు. విహార యాత్రలో పడవలో ప్రయాణం చేస్తున్న పర్యాటకులు.. అకస్మాత్తుగా వచ్చిన అలల కారణంగా పడవ బోల్తా పడి, చాలామంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురి మృతదేహాలు విమానశ్రయానికి రావడంతో సంబంధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలను లావా మొబైల్ కంపెనీతో పాటు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు తరలించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బోటు ప్రమాద మృతదేహాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



