Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేకపోతుల కమలమ్మ సంతాప సభ

మేకపోతుల కమలమ్మ సంతాప సభ

- Advertisement -

నవతెలంగాణ – ముషీరాబాద్
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మేకపోతుల రమణ మాతృమూర్తి కమలమ్మ సంతాప సభ మంగళవారం హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాట్రగడ్డ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పాల్గొని కమలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు-మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, సుప్రజ ఆస్పత్రి ఎమ్‌డీ శిగ విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగోని బాలరాజుగౌడ్, మాజీ టాడి కార్పొరేషన్ చైర్మెన్‌ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ సంఘం సీనియర్ నాయకులు చింతల మల్లేశంగౌడ్, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్నగౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్, హైకోర్టు న్యాయవాది నల్లమాస కృష్ణ, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు జి.రాములు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ దుర్గయ్య గౌడ్, వైరు శేఖర్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -