Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు భూమి కేటాయించాలని సిపిఐ నేతలకు వినతి

పేదలకు భూమి కేటాయించాలని సిపిఐ నేతలకు వినతి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సర్వే నంబర్–8లో ఉన్న ప్రభుత్వ భూమిలో మూడు ఎకరాలను అర్హులైన పేదలకు కేటాయించాలని కోరుతూ స్థానిక పేదలు అనేక రోజులుగా గుడిసెలు వేసుకొని అక్కడే నివసిస్తూ తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా పేదల తరఫున మంగళవారం  సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లిగంటి సత్యంలకు సమస్యలను వివరిస్తూ  మెమొరాండం అందజేశారు.

ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు కేటాయించి వారికి నివాస హక్కు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్,ఆలేరు మండల కార్యవర్గ సభ్యుడు కందుల మధు,భూపోరాట కమిటీ సభ్యులు మూతి భవాని, సంపతి, పార్వతి, సంధ్య, కవిత, యాదమ్మ, సుశీల, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -