Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం

విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం

- Advertisement -

అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్-2026లోనారాయణ విద్యార్థి శ్రేష్ఠ్ సురయకు స్వర్ణ పతకం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కొలంబియాలోని బొగోటా నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ) 2026లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి శ్రేష్ఠ సురయ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాల మేధావులతో పోటీపడి, భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన శ్రేష్ఠ్ సురయ అద్భుత ప్రతిభతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలోని ఐదుగురు సభ్యులూ స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ]తద్వారా చైనా, రష్యా, సౌత్ కొరియా, కజకిస్తాన్, తైవాన్ దేశాలతో కలిసి భారతదేశం ప్రపంచస్థాయిలో “జాయింట్ వరల్డ్ ర్యాంక్ నెం.1” సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ 56వ ఒలింపియాడ్‌లో ప్రపంచవ్యాప్తంగా 87 దేశాల నుంచి 381 మంది అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు.

​జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అద్భుత ప్రతిభ
గ్లోబల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, శ్రేష్ఠ్ సురయ ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 58వ ర్యాంక్ సాధించి తన అసాధారణ విద్యావైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ డబుల్ అచీవ్‌మెంట్ నారాయణ విద్యాసంస్థల ప్రపంచస్థాయి శిక్షణకు, విద్యార్థి అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘనవిజయంపై నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 58వ ర్యాంక్ సాధించిన శ్రేష్ఠ్ సురయను చూసి ఎంతో గర్విస్తున్నాం. ఇది శ్రేష్ఠ నిరంతర కృషికి, తల్లిదండ్రులకు దక్కిన గౌరవం. ఈ గెలుపు నారాయణ కుటుంబానికే కాకుండా దేశ మొత్తానికి గర్వకారణం.’ అని కొనియాడారు. “నారాయణ విద్యాసంస్థల్లో మేము కాన్సెప్చువల్ లెర్నింగ్, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం మరియు వ్యక్తిగత పర్యవేక్షణ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. నారాయణ ఒలింపియాడ్ శిక్షణా విధానం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తున్నది. గత కొన్నేళ్లుగా నారాయణ విద్యార్థులు ఐపీహెచ్ఓ, ఐసీహెచ్ఓ, ఐబీఓ, ఐఓఏఏ, ఐజెఎస్ఓ, ఐఎంఓ, ఎన్ఎంటీసీ వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ఘనమైన కీర్తిని తీసుకువచ్చారు. శ్రేష్ఠ్ సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరింత మంది యువ విద్యార్థులు పెద్ద కలలు కనడానికి, ఉన్నత లక్ష్యాలను చేరందుకు స్పూర్తినిస్తుంది.” అని తెలిపారు. గత 47 ఏళ్లుగా నారాయణ విద్యాసంస్థల అనుభవం, నైపుణ్యం, విద్యార్థుల పట్టు ఉన్న నిబద్ధత అనే మూలస్తంభాలతో లక్షలాది మంది విద్యార్థుల ఒలింపియాడ్, కాంపిటేటివ్ కలలను నిజం చేస్తూ వస్తోంది. ఈ విజయానికి కృషి చేసిన టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -