– వర్షాలు లేక త్రాగునీరు ఇక్కట్లు..
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో మూగ జీవాలకు త్రాగు నీరు లేక ఇక్కట్లు పడుతున్నాయి. గతంలో గ్రామానికి కనీసం 4-5 నీటితొట్లు ఉండేవి. వాటి సాయంతో పశువులకు నీటి కొరత కొంతమేర తీరేది. మిగతా గ్రామ శివారులో అక్కడక్కడా చిన్న చిన్న నీటి కొలనులలో నీరు తాగేవి. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కొన్ని గ్రామాలలో నీటి తోట్లు చీలికలు వచ్చి నిరుపయోగంగా మారిపోయాయి. వీటికి మరమ్మత్తులు చేయడమో, లేక వాటి స్థానంలో కొత్త వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. సర్పంచులు, కార్యదర్శులు వీటి గురించి ఆలోచించే పాపాన కూడా పోవట్లేదు. ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు ఆశాజనకంగా కురవలేదు. దీంతో చిన్న కుంటలల్లో నీరు కూడా నిలవడానికి ఆస్కారమే లేకుండా పోయింది. దీంతో దాహార్తిని తీర్చుకునేందుకు మూగజీవాలు పడే అవస్థలు వర్ణణాతీతం. రోడ్లపై పారుతున్న మురుగు నీటిని కూడా తాగే స్థితికి పశువులు వచ్చాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా నాయకులు ఆలోచించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో నీటి తొట్లను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు గ్రామ పాలక వర్గాలకు ఆదేశాలు జారీ చేయాలని పశు సంపద ఉన్న రైతాంగం వేడుకుంటోంది.
మూగజీవాలకు మురుగు నీరే త్రాగునీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



