నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్ : నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ 2026 మొదటి అర్ధభాగంలో (హెచ్1) స్థిరమైన వృద్ధిని కనబరిచిందని. నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు నగరంలో మొత్తం 37,992 నివాస గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి, వీటి విలువ రూ. 26,400 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య 5 శాతం, వాటి విలువ 6 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే జూన్ నెలలో మాత్రం రిజిస్ట్రేషన్లు 13 శాతం తగ్గి 5,560కి పరిమితమయ్యాయి. జూన్ 5న ప్రభుత్వం గైడెన్స్ వాల్యూలను సవరించిన నేపథ్యంలో మే నెలలోనే రిజిస్ట్రేషన్లు అధికంగా జరగడం వల్లే జూన్‌లో స్వల్ప తగ్గుదల నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ అయిన ఇళ్లలో రూ. కోటి కంటే ఎక్కువ విలువైనవి 22 శాతం వాటాను కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌లోని గృహనిర్మాణ రంగం ఉద్యోగ అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు వినియోగదారుల డిమాండ్‌తో అత్యంత పటిష్టంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో గృహ అమ్మకాల్లో5 శాతం వృద్ధి
- Advertisement -
- Advertisement -



