ప్రతీ మూడు నెలలకు రూ.20వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడాన్ని మరోమారు మోడీ సర్కార్ వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మొత్తం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్)కు ప్రతీ త్రైమాసికంలో సుమారు రూ.20,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ వాటాల విక్రయాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ మొత్తాన్ని కేంద్ర ఖజానాకు జమ చేసేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ.18,561 కోట్ల విలువ చేసే పిఎస్‌యుల వాటాల విక్రయం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా దీపమ్ అధికారులకు డిస్ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్టు సమాచారం. పెరుగుతున్న ఆర్థిక లోటు, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వాటాల విక్రయంపైనే కేంద్రం ఎక్కువ దృష్టి సారిస్తోంది. కానీ దీర్ఘకాలంగా భారీ డివిడెండ్లను ఇస్తోన్న పిఎస్‌యులను ఇప్పటి అవసరాల కోసం, ప్రయివేట, కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ఆందోళకరం.
పీఎస్‌యూల వాటాల విక్రయం వేగవంతం
- Advertisement -
- Advertisement -



