Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కచ్చా కాలువ పనుల ప్రారంభంతో డ్రైనేజీ సమస్య పరిష్కారం

కచ్చా కాలువ పనుల ప్రారంభంతో డ్రైనేజీ సమస్య పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలో కచ్చ కాలువ పనుల ప్రారంభంతో పట్టణంలో వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం రూ.2.60 కోట్ల వ్యయంతో కచ్చా కాలువలను, సీసీ కాలువ నిర్మాణ పనులను, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులుతో పాటు పరిశీలించారు. 

ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకుని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని అన్నారు. గతంలో కచ్చా కాలువల కారణంగా వర్షపు నీరు నిలిచిపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రస్తుతం రూ.2.60 కోట్లతో చేపట్టిన సీసీ కాలువల నిర్మాణంతో వర్షపు నీటి పారుదల మెరుగుపడి ప్రజలకు శాశ్వత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సదుపాయాల అభివృద్ధికి మున్సిపాలిటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల సహకారంతో ఆలేరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో   2,9,10,11,12 వార్డుల  కౌన్సిలర్లు  మరియమ్మ మార్క్, పస్తం   ఆంజనేయులు,  మల్లెల శ్రీకాంత్, సరిత,  జూకంటి సంపత్ కుమార్, జట్ట సరిత సిద్దులు, మున్సిపల్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -