Friday, July 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు క్యాబినెట్

నేడు క్యాబినెట్

- Advertisement -

పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి పునరుద్ధరణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఆమోదం
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
రాష్ట్ర మంత్రివ‌ర్గం శుక్ర‌వారం భేటీ కానుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాయంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌మావేశంలో గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయాల‌నే కీలకాంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 70(3)కు సవరణకు స‌ర్కారు సిద్ధ‌మైందని సంబంధింత ఉన్న‌తా ధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను పంచాయ‌తీ రాజ్ శాఖ ఇప్ప‌టికే సిద్దం చేసింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెల‌ప‌నుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని నిధులను సమీప ప్రభుత్వ ట్రెజరీలోనే జమ చేయాలనే నిబంధ‌న ఉంది. దీని వల్ల పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఆర్థిక స్వతంత్రతపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో వాటి సొంత ఆదాయంపై విధించిన పరిమితులను తొలగించి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలోనే జమ చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేర‌కు క్యాబినెట్‌లో చ‌ర్చించి, ఆమోదం తెల‌ప‌నున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -