Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరిటైర్డ్ సీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్‌ ‌కార్డులు మంజూరు చేయాలి

రిటైర్డ్ సీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్‌ ‌కార్డులు మంజూరు చేయాలి

- Advertisement -


సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రిటైర్డ్‌ ‌సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలయ్యే వరకు నగదు రహిత చికిత్సకు హెల్త్‌ ‌కార్డులు మంజూరు చేయాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌. దర్శన్ గౌడ్ డిమాండ్‌ ‌చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత ,ఆరోగ్య భద్రత లేక వృద్దాప్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ విరమణ చేసిన సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌‌గడ్‌, జార్ఖండ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్‌‌ను రద్దు చేశారని గుర్తు చేశారు. ఆ రాష్ర్టాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా సీపీఎస్‌ ‌రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.





.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -