నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపికైన 247 స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. శుక్రవారం హైదరా బాద్‌లోని కొమురం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ 2011 తర్వాత ఈఎస్ఐ శాఖలో తొలిసారి ప్రత్యక్ష నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారనీ, అందుకే సిబ్బంది కొరతను పూర్తిగా తొలగిం చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోం దన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 75 లక్షల మంది ఈఎస్ఐ ద్వారా లబ్దిపొందుతున్నారని చెప్పారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మందులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై సమగ్రంగా సమీక్షించామని తెలిపారు. సుమారు రూ.72 కోట్ల బకాయిలను విడుదల చేసి మందుల కొరతను నివారించ డంతోపాటు, నిర్వహణ, సేవల మెరుగుదలకు అదనపు నిధులను కేటాయించామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునిక సదు పాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా ఈ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు రామచం ద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయా లసిస్ యూనిట్, కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను బలోపేతం చేసి కార్డియాక్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రామగుండం, శంషాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 12 నుంచి 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను దశలవారీగా ఆధునికీకరిస్తామని వెల్లడించారు. ఈఎస్ఐ శాఖలో మొత్తం 599 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 మంది డెంటల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు సహా ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈఎస్ఐ సేవల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాచారం ఈఎస్ఐలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్ల డించారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యను మరింత బలో పేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ… 15 ఏండ్ల తర్వాత ఒకేసారి 247 మంది స్టాఫ్ నర్సులను నియమించడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. గత పదేళ్లలో ఈఎస్ఐ శాఖ ద్వారా కార్మికులకు అందాల్సిన సేవలు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. త్వరలోనే మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు కార్మిక శాఖను, కార్మికులను పట్టించుకోలేదని విమ ర్శించారు. కార్య క్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్ , ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ క్రాంతి సాగర్ తో పాటు ఈఎస్ఐ, కార్మిక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



