Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లలతో సహా బావిలో దూకిన తల్లి

పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి

- Advertisement -

తల్లీకూతురు మృతి, కొడుకు క్షేమం
రంగారెడ్డి జిల్లా శంకర్‌‌పల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ-శంకర్‌‌పల్లి

కుటుంబ కలహాలతో పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు మృతిచెందగా.. కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌‌పల్లి మండలం కొత్తపల్లిలో జరిగింది. సీఐ ముధసర అలీ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని సంగేం గ్రామానికి చెందిన సుధాకర్, వసంత(35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌, నవ్య(15) ఉన్నారు. సుధాకర్‌ 12 ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం శంకర్‌‌పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి కుటుంబంతో సహా వలసవచ్చాడు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, అప్పుడప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు. సుధాకర్‌ ‌తాగుడుకు బానిసై భార్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. గురువారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆ గొడవ పెద్దది కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత, పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కొత్తపల్లి గ్రామ శివారులోని పాడుబడిన బావి వద్దకు వెళ్లి.. మొదటగా కూతురుని, తర్వాత కొడుకును బావిలో తోసేసి, తానూ దూకింది. వసంత, నవ్య బావిలో మునిగి మృతిచెందారు. కొడుకు చెట్లు కొమ్ముకు చిక్కుకుని, చాలా సేపు బావిలోనే ఉండిపోయాడు. కొమ్మల సహకారంతో బయటకు వచ్చిన వరుణ్‌.. ఈ విషయాన్ని తండ్రితోపాటు గ్రామస్తులకు చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి, చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -