Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

- Advertisement -

లీకేజీలను అరికట్టేలా శాఖల మధ్య మరింత సమన్వయం
ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌ సీఎం రేవంత్‌‌రెడ్డితో భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకో వడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియో గించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొం దించడంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విస్తృతం చర్చలు జరిపారు.
శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌హెచ్ఆ‌ర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో ముఖ్యమంత్రి ‌రేవంత్‌‌రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ఈ సందర్భంగా వారు చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్‌ సుబ్రమణియన్‌‌తో చర్చించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు పరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే దిశగా జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థను తేనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉంటోందని సుబ్రమణియన్ వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట వేయొచ్చని కోరారు.
ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు.
ఈ డేటాతోపాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -