Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌నేడే సరూర్‌‌నగర్‌‌లో యువ సంగ్రామ సదస్సు

‌నేడే సరూర్‌‌నగర్‌‌లో యువ సంగ్రామ సదస్సు

- Advertisement -


పోలీసుల నిరాకరించడంతో హైకోర్టు అనుమతి
యువత గొంతు నొక్కాలని యత్నించిన ప్రభుత్వ కుట్ర విఫలం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు శనివారం ఉదయం పది గంటలకు జరగనుంది. అయితే ఈ సదస్సు నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో యువ సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌శుక్రవారం ఎక్స్‌ ‌ద్వారా స్పందించారు. యువ సంగ్రామ సదస్సును అడ్డుకుని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కుట్ర విఫలమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ సదస్సుకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా యువత తరఫున బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. యువతీ యువకులారా తరలిరావాలనీ, సరూర్‌నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ మోసాలను ఎండగడదామని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ మెడలు వంచుదామనీ, హామీల అమలుకు జంగ్ సైరన్ పూరిద్దామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం జరిగే “యువ సంగ్రామ సదస్సు”కు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్‌ ‌లీడర్‌ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సరూర్‌ ‌నగర్‌ ‌స్టేడియం వద్ద బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి యువత అంటే ఎందుకింత భయమని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిందని అన్నారు. రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు సీఎం రేవంత్‌‌రెడ్డి చదువుకోవాలని సూచించారు. హక్కులు కాపాడాలని రాహుల్ గాంధీ అంటుంటే, రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -