Saturday, July 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మనువాదం కోసమే దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లు రద్దు

మనువాదం కోసమే దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లు రద్దు

- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి
ఒకే దేశం, ఒకే మతం అన్నప్పుడు..
ఒకే కులం ఎందుకు ఉండదు?
అడిగేవారు లేరనుకుంటే పొరపాటు..ఎర్రజెండా ఉద్యమిస్తది:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేస్తూ దళిత క్రైస్తవ గర్జన సభ
నవతెలంగాణ-మహబూబ్‌‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘ఒకే దేశం ఒకే మతం అంటున్నప్పుడు దేశంలో ఒకే కులం ఎందుకు ఉండకూడదు. మనుధర్మాన్ని అమలు చేయడం కోసమే దళిత క్రిస్టియన్లపై దాడి జరుగుతుంది. దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల రద్దు కూడా అందులో భాగమే. దళితుల హక్కులు హరిస్తుంటే అడిగేవారు ఎవరూ లేరనుకుంటే పొరపాటు. సామాజిక వర్గాల పక్షాన దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు ఎర్రజెండా ఉంది’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, స్వతంత్రానికి భంగం కలిగించే విధంగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని, తక్షణమే అట్టి తీర్పును వెనక్కి తీసుకో వాలన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ లోని జై జై ఆర్ ఫంక్షన్ హాల్ లో రాజ్యాంగ హక్కుల సాధన సమితి, మహబూబ్ నగర్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దళిత క్రైస్తవ మహా గర్జన’ సభలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ దేశంలో మనువాదం పెరిగి పో తుందని, ఇతర మతాలపై దాడి జరుగు తుందన్నారు. క్రైస్తవాన్ని స్వీకరించింది కేవలం దళితులు, బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదని, అగ్రకులాలు సైతం క్రైస్తవంలో ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి మతం మారినా కులం అట్లనే ఉంటుందని, కేవలం దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తేనే వారి రిజర్వేషన్ తీసివేయడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అని ప్రశ్నిం చారు. దళితుల హక్కులు, రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి ఎర్రజెండా ముందుం టుందని భరోసానిచ్చారు. 1985లో కారంచేడులో దళిత క్రిస్టియన్లను ఊచకోత కోసినప్పుడు, 1991లో చుండూరులో దళితుల సజీవ దహనం చేసినప్పుడు ఎర్రజెండా ముందుండి పోరాడిందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు దళితులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత క్రైస్తవులకు ఎల్లప్పుడు అండగా ఉంటాం:వినోద్‌‌కుమార్‌
​దళిత క్రైస్తవులకు అన్యాయం చేసేలా ఉన్న సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్‌కుమార్ అన్నారు. దళిత సోదరులకు జరిగే ప్రతి అన్యాయం పట్ల ప్రశ్నిస్తామన్నారు. చట్టపరంగా తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవ గర్జన సభలు నిర్వహించాలన్నారు.

​ఐక్య పోరాటాలు నిర్వహించాలి: స్కైలాబ్‌ ‌బాబు
​దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అడ్డు కోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. చండూరు దళితుల ఊచ కోత దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆ అమరుల త్యాగాల స్ఫూర్తితో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. కార్య క్రమంలో రాజ్యాంగ హక్కుల సాధన సమితి నాయకులు పాస్టర్ ప్రసాద్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లే గోపాల్, జిల్లా కార్యదర్శి ఏ రాములు, బి వేంకటయ్య, కడియాల మోహన్ , ఏనుగొండ రామస్వామి పాస్టర్లు ఉమ్మడి జిల్లా నాయకులు దళిత క్రైస్తవులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -