దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన
సినీ నటి మీనాక్షి చౌదరి
నవతెలంగాణ – దిల్‌సుఖ్‌నగర్
తెలంగాణలో ప్రముఖ వస్త్ర విపణి సంస్థగా గుర్తింపు పొందిన మాంగళ్య షాపింగ్ మాల్ తన 32వ శాఖను శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించింది. సినీ నటి మీనాక్షి చౌదరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి అభిమానులతో మమేకమయ్యారు. ఆమెను చూసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ నటి మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌నగర్ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు విశేష ఆదరణ అందిస్తారని తనకు నమ్మకం ఉందని, ఈ శాఖ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడం ద్వారానే వినియోగదారుల విశ్వాసాన్ని పొందామని తెలిపారు. తమ సొంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక ఫ్యాషన్ ధోరణులకు అనుగుణంగా రూపకల్పన చేసి వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. 2012లో వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రస్థానం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో విజయవంతంగా సేవలందిస్తోందన్నారు. మహిళలు, పురుషులు, యువత, చిన్నారుల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్లతోపాటు వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్లు ఈ మాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.99 నుంచి రూ.లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు లభిస్తుండటంతో ఇది సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ డెస్టినేషన్‌గా నిలుస్తోందన్నారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంత ప్రజలు పెండ్లి, శుభకార్యాల షాపింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేసుకునే అవకాశం కలిగిందని నిర్వాహకులు తెలిపారు. మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్ త్వరలో మరో 10 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్టు, భవిష్యత్‌లో తమిళనాడుకు కూడా విస్తరించనున్నట్టు డైరెక్టర్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల ఆదరణతో పాన్ ఇండియా స్థాయిలో అగ్రగామి షాపింగ్ మాల్‌గా ఎదగడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలు కుటుంబ సమేతంగా మాంగళ్య షాపింగ్ మాల్‌ను సందర్శించి నూతన షాపింగ్ అనుభూతిని పొందాలని కోరారు.
మాంగళ్య షాపింగ్ మాల్ 32వ శాఖ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



