నీటి విడుదల కోసం బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా
కన్నెపల్లి పంపు హౌస్ మోటర్లు నడపాలి:
బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-మర్కుక్
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశ యాలను పూర్తిస్థాయిలో నింపాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజగవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద సుమారు ఐదు వందల మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించారన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల పంటలు ఎండి పోకుండా తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలం బిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కరుణాకర్ రెడ్డి, మర్కుక్ మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం యాదవ్, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ చందన రవి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కనకయ్య, మ్యాకల కనకయ్య, కమ్మరి బాలరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొండపోచమ్మ మల్లన్న సాగర్ నింపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



