దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత
బార్బడోస్ (వెస్టిండీస్)
క్రికెట్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ గ్యారీ సోబర్స్ (89) శుక్రవారం కన్నుమూశారు. గొప్ప ఆల్‌రౌండర్‌గా, సహజసిద్ధ క్రికెటర్‌గా పేరుగాంచిన గ్యారీ సోబర్స్ బార్బడోస్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. టెస్టులో బ్యాటర్‌గా, లెఫ్టార్మ్ పేసర్‌గా, సంపద్రాయ మణికట్టు స్పిన్నర్‌గా, పాదరసంలా కదిలే ఫీల్డర్‌గా, క్లోజిన్ క్యాచర్‌గా మైదానంలో విన్యాసాలు చేసే గ్యారీ సోబర్స్‌ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడమన్ ‘ఫైవ్ ఇన్ వన్ క్రికెటర్’గా పిలిచేవారు. గ్యారీ సోబర్స్( 5డి ప్లేయర్) మరణం పట్ల క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. ‘ ఓ గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. సర్ గ్యారీ సోబర్స్ మన హృదయాల్లో ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటారు’ అని క్రికెట్ వెస్టిండీస్ బోర్డు ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. 1952-53లో 16 ఏండ్ల ప్రాయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన గ్యారీ సోబర్స్.. ఓ ఏడాది తర్వాత టెస్టుల్లో అడుగుపెట్టాడు. జమైకాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 14, 26 పరుగులు చేయటంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 4/75తో నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు.
కెరీర్ తొలినాళ్లలో బౌలర్‌గానే ఆడిన సోబర్స్.. 23 ఏండ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. 1958లో పాకిస్తాన్‌పై సబీనా పార్క్‌లో 365 పరుగులు చేసిన సోబర్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ రికార్డు 1994 వరకు చెక్కచెదరలేదు. బ్రియాన్ లారా ఈ రికార్డును అధిగమించినప్పుడు సోబర్స్ గ్యాలరీలో ఆ ఇన్నింగ్స్‌ను ఆస్వాదిస్తూ, సెలబ్రేట్ చేశాడు. 1968లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 383 మ్యాచుల్లో 54.87 సగటుతో 28,314 పరుగులు, 27.74 సగటుతో 1043 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌కు 94 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన సోబర్స్ 57.78 సగటుతో 8032 పరుగులు, 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. 1974లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి సోబర్స్ తప్పుకున్నాడు. గ్యారీ సోబర్స్ కెరీర్‌లో ఒకే ఒక్క వన్డే మ్యాచ్, లిస్ట్-ఏ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడాడు. విజ్డెన్ శతాబ్దపు ఐదుగురు క్రికెటర్లలో ఒకటిగా సోబర్స్ నిలిచారు. గ్యారీ సోబర్స్ కెరీర్‌లో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడాడు.
5డి ప్లేయర్ ఇక లేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



