ప్రకృతి వైపరీత్యాలను తట్టకుకునేలా నిర్మాణాలు
ఎస్కీ డైరెక్టర్: కల్నల్ హర్ పాల్ సింగ్ గ్రేవల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలతో పాటుగా విశాలమైన వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు వినూత్నమైన డిజైన్స్ తో ఏర్పాటవుతున్నాయని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ కల్నల్ హర్ పాల్ సింగ్ గ్రేవల్ తెలిపారు. వీటిలో 50 నుంచి 60 అంతస్థుల భవనాలు హైదరాబాద్ నగరంలోనే మనం చూడొచ్చని చెప్పారు. భూకంపాలను సైతం తట్టుకునే రీతిలో ఇంజినీరింగ్ అద్భుతాలతో నిర్మిస్తున్న ఈ నిర్మాణాల వెనుక ఇంజినీరింగ్ టెక్నాలజీ, సిబ్బంది నైపుణ్యందాగి ఉన్నాయన్నారు. గచ్చిబౌలిలోని ఎస్కీలో సివిల్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ విభాగంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్ట్రక్చరల్ డిజైన్ అండ్ సీస్మిక్ రెసిస్టన్స్ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్ బ్రిడ్జి ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటని చెప్పారు. సముద్రం లోపల నుంచి నిర్మించిన ముంబయి కోస్టల్ రోడ్, హిమాచల్ పర్వతాల్లో నిర్మించిన 9 కిలోమీటర్ల అటల్ టన్నెల్ అన్నీ భూకంపాలను తట్టుకునే రీతిలో అద్భుతమైన స్ట్రక్చరల్ డిజైన్స్ తో నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతాలన్నారు. ఇలాంటి వర్క్‌షాప్స్ యువ ఇంజినీర్ల మేధస్సుకు దోహదపడుతుందన్నారు.
మైహోమ్ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ కంట్రోల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వోల్కర్ స్టాఫిన్ మాట్లాడుతూ.. తమ కన్‌స్ట్రక్షన్ నిర్మించిన పలు నిర్మాణాల్లో వందలాదిమంది యువ ఇంజినీర్లు పనిచేస్తున్నారని, వారందరికీ స్ట్రక్చరల్ డిజైన్స్ లో ఎప్పటికప్పుడూ శిక్షణ ఇస్తూనే ఉంటామన్నారు. ‘దేవశ్రీ ఇస్పాత్ టీ.ఏ.టీ’ టెక్నీకల్ మార్కెటింగ్ హెడ్ రాజీవ్ సింగ్ బిష్త్ మాట్లాడుతూ.. 1600 సెంటీగ్రేడ్ వేడిలో వివిధ నిర్మాణాలకు ఉపయోగించే స్టీల్ హైదరాబాద్ లోని తమ కంపెనీలో తయారవుతుందని, యువ ఇంజినీర్లు ఎప్పుడైనా తమ కంపెనీని సందర్శించి స్టీల్ తయారీని చూడొచ్చని చెప్పారు. మహేంద్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ కుమార్ పసుపులేటి వివిధ స్ట్రక్చరల్ డిజైన్స్ గురించి మాట్లాడారు. విఎంఆర్ విజ్ఞాన జ్యోతిలో ప్రొఫెసర్ డాక్టర్ మల్లిక వివిధ కేస్ స్టడీస్ , ఛాలెంజెస్ గురించి వివరించారు. సివిల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ ఆర్. వెంకటరెడ్డి, సీ.హెచ్. తిలక్, ఎం.సునీత కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. నగరంలోని అపర్ణ, మైహోమ్, కపిల్, ఎస్.కె.శర్మ, పాలొమి తదితర ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 60 మంది ఇంజినీర్లు హాజరయ్యారు.
భారత్‌కు యువ ఇంజినీర్లు అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



