రాష్ట్ర క్షయవ్యాధి అధికారి డాక్టర్ ఎ.రాజేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి టీబీ రోగికీ 100 శాతం డిఫరెన్షియేటెడ్ టీబీ సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర క్షయవ్యాధి అధికారి డాక్టర్ ఎ.రాజేశం సూచించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ జిల్లాపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కార్యక్రమం అమలు తీరును సమీక్షించి, టీబీ అనుమానితుల గుర్తింపును మరింత పెంపొందించాలని సూచించారు. టీబీ నోటిఫికేషన్లను పెంచాలనీ, నమోదు చేసిన ప్రతి టీబీ రోగికీ 100 శాతం డిఫరెన్షియేటెడ్ టీబీ సంరక్షణ అందించాలని అన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులందరికీ టీబీ ప్రివెంటివ్ థెరపీ ప్రారంభించాలని తెలిపారు. “టీబీ ముక్త్ భారత్” స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. టీబీ రోగులకు పోషకాహార మద్దతుగా ఫుడ్ బాస్కెట్లను అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
కార్యక్రమం అమలును మరింత బలోపేతం చేయడంతోపాటు రోజువారీ పురోగతిని పర్యవేక్షించేందుకు, ప్రతి టీబీ యూనిట్ కీలక కార్యక్రమ సూచికలతో కూడిన డైలీ గూగుల్ షీట్స్ మానిటరింగ్ డ్యాష్‌బోర్డ్ ను ప్రతిరోజూ నవీకరించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో కూడిన కార్యాచరణ, సకాలంలో నివేదికల సమర్పణ, నాణ్యమైన సేవల అందజేత ద్వారా “టీబీ ముక్త్ హైదరాబాద్” లక్ష్యాన్ని సాధించడంతో పాటు, భారతదేశ టీబీ నిర్మూలన లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాయిబాబా, ఇతర ప్రోగ్రామ్ అధికారులు, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్‌వైజర్లు, సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్లు, జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీబీ రోగులకు డిఫరెన్షియేటెడ్ సంరక్షణ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



