- Advertisement -
నేనేమో నీ కోసం
కళ్లల్లో ఒత్తులేసుకుని
ఎదురుచూస్తూ వుంటాను
నువ్వేమో వాటిని
ఆర్పేసే పనిలో వుంటావు!
నువ్వెప్పుడైనా
నా కళ్లవైపు చూసి వుంటే కదా
అక్కడున్న తడితో నీ హృదయం
మెత్తబడుతుందని నీ భయం కదూ!
ఎన్ని ముళ్లను ఒళ్లంతా
పొడిపించుకుని
ఈ ఒక్క గులాబీని నీకోసం తెచ్చానో
వాసన చూడకుండానే
కింద పడేసి వెళ్లిపోయావు
అది వొట్టి గులాబీ కాదు
నా హదయమని తెలిసి కూడా!
– సత్య చిత్తలూరి, 9133832246
- Advertisement -



